హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్గెలిస్తే ప్రజా ప్రభుత్వం వస్తుందని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి వెల్లడించారు. వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు మళ్లీ ప్రజాపాలన తెస్తామన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ సీఎంలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని గుర్తుచేశారు.
సెక్రటేరియెట్కు రాని సీఎం.. కేసీఆర్ మాత్రమేనని ఆరోపించారు. ఇంజినీర్లకు బదులు కేసీఆర్ డిజైన్ల వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని మండిపడ్డారు.