
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 420 అని వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ పై కేసు పెట్టాలన్నారు. పుట్టుకతో గుడ్డి, చెవుడు ఉన్నవాళ్లే.. కేటీఆర్ తరహా వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు.
ALSO READ :-- ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దు
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించకుండానే 65 సీట్లు వచ్చాయి...ముందే ప్రకటించి ఉంటే 80కి పైగా సీట్లు వచ్చేవన్నారు మల్లు రవి. ప్రజా పాలన కేటీఆర్ కళ్ళకు కనిపించడం లేదా? ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కలుస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కేసుల భయంతో బతికారన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు లేక వెలసిబోయిన సెక్రటేరియట్, ఇపుడు మంత్రులను సాధారణ ప్రజలు కూడా డైరెక్ట్ గా కలుస్తున్నారని చెప్పారు. 10లక్షల ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే 6వేల మంది పేదలు లబ్ధి చెందారని చెప్పారు.