
- సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలి
- కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సీఎస్ ఎస్ కె జోషి రాష్ట్ర ప్రగతి నివేదిక ఎలా విడుదల చేస్తారని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నిం చారు. సీఎస్ తీరు అధికార టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేలా ఉందంటూ ఆక్షేపించా రు. ఎన్నికల సంఘం వెంటనే సీఎస్ ను బదిలీ చేయాలని శనివారం డిమాండ్ చేశారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కుమారుడు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్ పై పలు కేసులు ఉన్నాయని చెప్పారు. తలసానిపై ఈసీకి ఫిర్యా దు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రగతి నివేదిక విడుదల చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఈ స్థాయిలో దిగజారిపోవడాన్ని ఇప్పటివరకూ చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు విమర్శించారు. ప్రధాని మోడీ కనుసన్నల్లో నే ఈసీ పనిచేస్తోందన్నారు. తెలంగాణలో కూడా నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.