బషీర్ బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి హరీశ్ రావుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20న కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎంపై హరీశ్ అనుచిత వ్యాఖ్యలు చేశార న్నారు.
చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్మాస్టర్ అంటూ మాట్లాడారని, హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరిం చారు. సీఎంపై చిల్లర కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా రాష్ట్ర మహిళా మంత్రులపై ట్రోలింగ్స్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.