కాశీబుగ్గ, వెలుగు: సిటీలోని మడిబజార్లో దారుల్ నూరే మదీనా స్కూల్లో అరబ్బీ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ ఆయూబ్ దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయూబ్ మాట్లాడుతూ చలి స్టార్ట్కావడంతో 25వ డివిజన్‌కు చెందిన ఐలే హదీస్, కహర్ ఆధ్వర్యంలో కొండా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దారుల్ నూరే మదీనా స్కూల్లో అరబ్బీ చదువుతున్న పిల్లలకు దుప్పట్లు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పూర్ఖాన్, అబ్ధుల్ అకీమ్, ఫయాజ్ ఖాన్, రహీర్ ఖాన్, ఫెరోస్, మహ్మద్ అజం, ఇస్మాయిల్, మాసూకు తదితరులు ఉన్నారు.