- రాహుల్ గాంధీ బర్త్‌డే.. నీలం మధు ఆఫర్
రామచంద్రాపురం, వెలుగు : రాహుల్‌గాంధీ బర్త్‌డేను పురస్కరించుకొని కాంగ్రెస్ నేత నీలం మధు ఆఫర్ ప్రకటించారు. జూన్ 19న పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టిన ప్రతి బిడ్డకు రూ. 10 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం పుట్టిన ఐదుగురికి సంబంధించిన రూ. 50 వేల చెక్కును మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ రాహుల్ గాంధీ బర్త్‌డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధికి అందరితో కలిసి పని చేస్తానని, భవిష్యత్‌లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు.