
- కాంగ్రెస్ నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. ఆదివారం చిట్కుల్ గ్రామంలో మధు సహకారంతో- మెడీ స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. గ్రామాల్లో సామాన్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. నేటి కాలంలో కాలుష్యం, రసాయనాలతో పంటల్ని పండించడం, కలుషిత ఆహారం తీసుకోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల వ్యాధుల బెడద పెరిగిందన్నారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా రోగాన్ని తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందన్నారు. దీంతో వ్యాధి ప్రారంభంలోనే నయం చేసుకోవచ్చన్నారు. వైద్య శిబిరాల్లో రోగ నిర్ధారణ పరీక్షలతో వ్యాధిని తెలుకుని అందుకు తగిన చికిత్స చేస్తారని చెప్పారు. మెగా మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడిస్టార్ హాస్పిటల్ ఎండీ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ లత, డాక్టర్లు రష్మిక, శివ మోహన్ రెడ్డి, సంతోష్, ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు పొట్టి నారాయణరెడ్డి, వి. నారాయణ రెడ్డి, వెంకటేశ్, వి. వెంకటేశ్, బుజ్జి, గౌరీ శంకర్, అనిల్, శ్రీను, మెడికల్ క్యాంపు నిర్వాహకులు పాల్గొన్నారు.