సీఎం ను కలిసిన నీలం మధు

సీఎం ను కలిసిన నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డిని హైదరాబాద్​లో కాంగ్రెస్​ నాయకుడు​నీలం మధు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఓ పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. 

ఆర్ఆర్ఆర్, మూసీ నది ప్రక్షాళన చేపట్టడంతోపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్యకర్తలు వెన్ను దన్నుగా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.