- నీలం మధు
పటాన్చెరు, వెలుగు: ఆత్మ రక్షణకు, క్రమశిక్షణకు కరాటే దోహదం చేస్తుందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం ఎద్దుమైలారం గ్రామ పరిధిలోని వోడీఎఫ్ సారత్ కమ్యూనిటీ హాల్లో నిర్వాహకులు శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వ స్టేట్ లెవెల్ సక్సెస్ షోటోకాన్ కరాటే పోటీలను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరాటే ఆత్మ రక్షణతో పాటు వ్యాయామంగా పనికొస్తుందన్నారు. మహిళలు తమ రక్షణ కోసం కరాటే ను నేర్చుకోవాలని సూచించారు. కరాటే శిక్షణ అందిస్తూ ఎంతోమంది కరాటే సాధకులను తయారు చేస్తున్న సక్సెస్ షోటోకాన్ కరాటే నిర్వాహకులను మధు అభినందించారు. సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజు, ఈశ్వర్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, వెంకటేశ్, రాజు గౌడ్, బాలు, సతీశ్, పాండు, గోపాల్ పాల్గొన్నారు.