
మహాముత్తారం,వెలుగు : మహాముత్తారం కాంగ్రెస్ మండలాధ్యక్షురాలు కీర్తిబాయి కాంగ్రెస్ ప్రచారానికి వెళ్తూ కార్ ఆక్సిడెంట్లో గురువారం చనిపోయింది. కీర్తిబాయి కాటారం నుంచి యామన్‌పల్లి మీదుగా నిమ్మగూడెం వెళ్తున్నారు. ఈ క్రమంలో యామన్‌పల్లి దాటగానే కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే చనిపోయింది. కారులో ఉన్న సీనియర్ నాయకుడు జాడి రాజయ్య సైతం తీవ్రంగా గారపడ్డాడు. కీర్తిబాయి మృతి విషయం తెలుసుకున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు,ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.