- కాంగ్రెస్ నేత పొంగులేటి
ఖమ్మం రూరల్, వెలుగు : భద్రాచలం రాముడిని సైతం మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కాంగ్రెస్ నేత పొంగులేని శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. దేవున్నే మోసం చేసిన ఆయనకు ప్రజలను మోసం చేయడం పెద్ద పనికాదన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్విస్మరించాడని తెలిపారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ,ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు.
ప్రజలు, నిరుద్యోగులు, రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో యుత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి చరణ్‌రెడ్డి, మాధవిరెడ్డి, బేబీ స్వర్ణకుమారి, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, హరినాథ్‌బాబు, బొర్రా రాజశేఖర్, కొక్కిరేణి జడ్పీటీసీ శ్రీను,శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.