ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి : పొంగులేటి ప్రసాద్​రెడ్డి

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి : పొంగులేటి ప్రసాద్​రెడ్డి

కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని జిల్లా కాంగ్రెస్​ నేత పొంగులేటి ప్రసాద్​రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నేరు నుంచి పాలేరు వరకు గ్రావిటీ కాల్వను నిర్మించడం ద్వారా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. 

ఈ విషయమై ఇరిగేషన్ డీఈ రమేశ్​రెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి కూసుమంచి మండలంలో పలుగ్రామాల్లో  పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.