మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లి నుంచి గొల్లపల్లి వరకు పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. కోనరావుపేట మండలంలో కూలిపోయిన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పొన్నం డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వం కాదని..రైతులను ముంచే ప్రభుత్వమని విమర్శించారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు పరిష్కారించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కేసీఆర్ అసమర్ధపాలనకు ప్రజలే బుద్ధి చెప్తారు : ఆది శ్రీనివాస్
ఏడు ప్రాంతాలలో కాజ్ వే బ్రిడ్జి లు కూలి పోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా పని చేసిన జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హయాంలో నే బ్రిడ్జిల నిర్మాణం జరిగిందన్నారు. కేసీఆర్ అసమర్ధపాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.