బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ జోకర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ కు మైండ్ ఖరాబయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేసీఆర్ డిసైడ్ చేస్తారనడం హస్యాస్పదమన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి జీర్ణించుకోలేక బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గంగులతో బండి సంజయ్ ములాఖత్ అయినట్లు లోకం కోడై కూస్తోందన్నారు. కవితను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.
బండి సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసింది కేసీఆరేనని ఆరోపించారు పొన్నం ప్రభాకర్ . అవసరం లేకున్నా బండి సంజయ్ ను అరెస్ట్ చేసి..ఆయనకు హైప్ ఇచ్చింది కేసీఆరేన్నా రు. కరీంనగర్ లో అభివృద్ధి పేరిట, ఐలాండ్ పేరిట కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయని అన్నారు. బండి సంజయ్ చేసే ఖర్చంతా గంగుల కమలాకర్ ద్వారా కేసీఆర్ భరిస్తున్నారని ఆరోపించారు.