కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలక్షన్లు దగ్గరపడుతున్నకొద్దీ ప్రజలను ఆకర్షించే విధంగా పార్టీలన్నీ సభలు నిర్వహిస్తూ.. ప్రతి పక్షాలపై విమర్శలు గుప్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు, పలు ఆరోపనలు చేశారు.
దేశంలోని పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కర్ణాటక ప్రజలను బీజేపీ లూటీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదని ప్రియాంక జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి.. అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రియాంక.