బీజేపీ కుట్ర తెలిసే.. చన్నీని సీఎం చేశాం

కోటక్పురా: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ నుంచే ఆప్ పుట్టిందన్నారు. ఢిల్లీలోని వైద్య, విద్యా సంస్థల్లో కొత్తగా వచ్చిన మార్పులేమీ లేవన్నారు. రాజకీయ పార్టీలు, నేతల గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘నవీ సోచ్ నవ పంజాబ్’ ర్యాలీలో ప్రియాంక వ్యాఖ్యానించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణాన్ని వివరిస్తూ.. గత ఐదేళ్లుగా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు నడిపిందన్నారు. ఆ కుట్ర గురించి ప్రజలకు తెలిసిందన్నారు. అందుకే చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎం చేశామన్నారు. ఈ సందర్భంగా ఆమె అమరిందర్ పేరును ప్రత్యక్షంగా పేర్కొనలేదు. 

మరిన్ని వార్తల కోసం:

అధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ హిట్టర్

ముఖ్యమంత్రిని ఓడించి తీరుతాం

సీఎం కేసీఆర్ బలుపెక్కి మాట్లాడుతున్నాడు