అదానీ అవినీతిని మోదీ దాస్తున్నరు .. ప్రధానిపై రాహుల్​ గాంధీ ఫైర్

అదానీ అవినీతిని మోదీ దాస్తున్నరు .. ప్రధానిపై రాహుల్​ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కప్పిపుచ్చుతున్నారని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీపై వచ్చే ఆరోపణల విషయంలో ఇండియాలో మౌనాన్ని ఆశ్రయించే మోదీ.. విదేశాలకు వెళ్లినపుడు మాత్రం అది తమ పర్సనల్ మ్యాటర్ అని జవాబు దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’​లో హిందీలో పోస్ట్ చేశారు. 

గౌతమ్ అదానీపై దేశంలో ఎవరు ఎన్నిసార్లు ప్రశ్నించినా మౌనం వీడరు. విదేశాల్లో అక్కడి జర్నలిస్టులు అడిగితే అది వ్యక్తిగత విషయమని అంటూ జవాబు దాటవేస్తారు. అమెరికాలో కూడా అదానీ అవినీతిని మోదీ కప్పిపుచ్చారు. స్నేహితుడి జేబు నింపడమే మోదీ జీకి జాతి నిర్మాణం అయినప్పుడు.. లంచాలు తీసుకొని దేశ సంపదను దోచుకోవడం పర్సనల్ మ్యాటరే అవుతుంది’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.