అమెరికాలో రాహుల్.. డాలస్‎లో ఘన స్వాగతం పలికిన ఇండియన్స్

అమెరికాలో రాహుల్.. డాలస్‎లో ఘన స్వాగతం పలికిన ఇండియన్స్

టెక్సస్: అమెరికాలో రాహుల్.. డాలస్‎లో ఘన స్వాగతం పలికిన ఇండియన్స్  అక్కడి ఎయిర్ పోర్టులో ఆయనకు ఇండియన్స్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ‘‘డాలస్ లో ఇండియన్స్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. నా పర్యటనలో అమెరికా, భారత్ మధ్య బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాను. అందుకోసం అవసరమైన చర్చల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఫేస్ బుక్‎లో రాహుల్ పోస్టు పెట్టారు.

 కాగా, లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి రాహుల్ అమెరికాకు వెళ్లారు. ఆయన సోమ, మంగళవారాల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. రాహుల్ పర్యటనలో భాగంగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. ‘‘ఇది రాహుల్ అధికారిక పర్యటన కాదు. కానీ వివిధ వర్గాలతో ఆయన సమావేశమవుతారు. విద్యావేత్తలు, జర్నలిస్టులు, స్టూడెంట్లు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఇంటరాక్ట్ అవుతారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో, జార్జ్ టౌన్ యూనివర్సిటీలో స్టూడెంట్లతో ఇంటరాక్షన్ ఉంటుంది” అని చెప్పారు.