బీజేపీ దేశాన్ని రెండుగా విభజించింది

జైపూర్: బీజేపీ దేశాన్ని రెండుగా విభజించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి దుంగార్ పూర్ లోని వాల్మీకీ, కృష్ణ, బ్రహ్మ ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ. 132 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మోడీ దేశ సంపదను కొంతమంది కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్నారు. మోడీ హయాంలో ఇవాళ దేశం రెండుగా చీలిందన్న ఆయన.... ఇద్దరు ముగ్గురు పెద్ద ఇండస్ట్రియలిస్టులతో ధనిక దేశంగా.. పేదలు, దళితులు, గిరిజనలు, బలహీన వర్గాలతో పేద దేశంగా ఏర్పడిందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్గిన సమైక్య భారత్ కావాలని ఆకాక్షించారు. కాంగ్రెస్, గిరిజనుల మధ్య సంబంధం చాలా పురాతనమైందన్నన్న రాహుల్... గిరిజనుల భూమి, నీళ్లు కాపాడేందుకు కాంగ్రెస్ హయాంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు