దేశంలో కుల గణన చేపట్టాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. క్యాస్ట్ సెన్సెస్ చేయాలని ప్రతిపక్షాలు సైతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. కుల గణన చేపడితేనే ఏ వర్గం జనభా ఎంత ఉంది..? వారికి అందాల్సిన ఫలాలు అందుతున్నాయా.. లేదా..? అనే విషయాలు తెలుస్తాయంటున్నారు అపొజిషన్ లీడర్స్. ఈ క్రమంలో దేశంలో కుల గణన చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఇండియా టూడే, సీ ఓటర్ సంస్థ సంయుక్తంగా సర్వే చేశాయి. ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలతో పాటు తాజాగా ఆగస్ట్ నెలలో చేసిన సర్వే రిజల్ట్స్‌ను వెల్లడించాయి.
ఈ సర్వే ప్రకారం.. ఫిబ్రవరిలో కుల గణన చేపట్టాలని 59 శాతం మంది, అవసరం లేదని 28 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే ఆగస్ట్ నెలలో చేసిన సర్వే ఫలితాలు చూస్తే.. కుల గణన అవసరం అని 74 శాతం మంది, అవసరం లేదని 24 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలతో పోలిస్తే.. ఆగస్ట్ నాటికి కులగణన అవసరం అనే డిమాండ్ భారీగా పెరిగింది. నాలుగు వ్యవధిలోనే కుల గణన అవసరం అనే డిమాండ్ ఏకంగా 13 పర్సెంట్ పెరిగింది.
ALSO READ | ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన
ఈ నేపథ్యంలో కుల గణనపై ఇండియా టూడే సర్వే ఫలితాలను ఉటంకిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై దేశ ప్రజల అభిప్రాయం ఏంటో ఈ సర్వేలో వెల్లడైందన్నారు. రోజురోజుకూ కుల గణనకు డిమాండ్ పెరుగుతోందని.. 74 శాతం మంది ప్రజలు క్యాస్ట్ సెన్సెస్ అవసరం అంటున్నారని గుర్తు చేశారు. కుల గణన చేపట్టి మా హక్కులు మాకు ఇవ్వండని స్పష్టమైన సందేశం ఇచ్చారన్నారు.
#MoodOfTheNation सर्वे में देश के मन की बात सामने आ गई है.
— Congress (@INCIndia) August 25, 2024
हर बीतते वक्त के साथ 'जातिगत जनगणना' की मांग बढ़ती जा रही हैं.
अब 74% लोगों का कहना है कि जातिगत जनगणना होनी ही चाहिए.
समाज में किसकी कितनी आबादी है?
इस सवाल के जवाब से ही सबकी भागीदारी सुनिश्चित की जा सकती है.
देश… pic.twitter.com/FLZBeJTls0