కేసీఆర్ను పరామర్శించిన రేణుకా చౌదరి

కేసీఆర్ను పరామర్శించిన రేణుకా చౌదరి

యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ ను  కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి పరామర్శించారు.  కాసేపు ఆయనతో మాట్లాడారు.  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  కేసీఆర్ త్వరగా కోలుకోని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.   

ఎర్రవల్లి తన నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు కేసీఆర్‌కుతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.