ముదిరాజ్​ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్

బీసీ గణనతో రాజకీయ అవకాశాలు పెరుగుతయ్​హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్​నేత నీలం మధు ముదిరాజ్ చెప్పారు. గురువారం శంకర్ పల్లిలో ముదిరాజ్ సంక్షేమ భవన ప్రారంభోత్సవానికి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్​లకు పెద్దపీట వేస్తున్నారని, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బీసీ కులగణన పూర్తయితే ముదిరాజ్ లకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఐక్యంగా ముందుకు వెళ్తే హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు, శంకర్​పల్లి మండల అధ్యక్షుడు తలారి మైసయ్య, అందే బాబయ్య, డాక్టర్ మద్దెల సంతోశ్, రావులపల్లి నారాయణ, శ్రీకాంత్, నరేష్, జంగయ్య, రాములు, మన్నె వెంకటేశ్, లింగం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.