- మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
- హాస్పిటల్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన
కామారెడ్డి, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉందని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మంగళవారం దోమకొండ సీహెచ్‌సీ ముందు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీహెచ్‌సీలో కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే డ్యూటీ చేస్తున్నారన్నారు. గర్భిణులు డెలీవరీ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందన్నారు.
Also Read:ట్రాక్టర్ ను ఢీకొన్న బొకారో ఎక్స్ ప్రెస్.. జార్ఖండ్ లో రైలు ప్రమాదం
సీహెచ్‌సీని ఏరియా హాస్పిటల్‌గా మార్చటంతో పాటు స్టాఫ్‌ను నియమించాలన్నారు. జూలై ఫస్ట్ వరకు అప్‌గ్రేడ్ చేయకపోతే నిరహార దీక్ష చేపడుతానన్నారు. అనంతరం దోమకొండ బస్టాండును ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్‌రెడ్డి, లీడర్లు స్వామి, భూమాగౌడ్, రమేశ్, చందు తదితరులు పాల్గొన్నారు.