కామారెడ్డి, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని, పైకి మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిచుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. లిక్కర్‌కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసి జైలులో పంపిన కేంద్రప్రభుత్వం కవితను ఎందుకు అరెస్ట్చేయలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవుతోందన్నారు.
కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం మేరకు కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడాలన్నారు. కార్యకర్తలు పార్టీని గెలిపిస్తే ఐదేండ్లు మీకు పార్టీ సేవ చేస్తుందన్నారు. 10న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలన్నారు. 9న నిజామాబాద్ అర్బన్‌లో తాను నామినేషన్ వేస్తానన్నారు. బండి సంజయ్‌ను స్టేట్అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ, బీసీని సీఎం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కామారెడ్డిలో సమన్వయం కోసం పార్టీ వేం నరేందర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కొండల్‌రెడ్డిని నియమించిందన్నారు. మీటింగ్‌లో నేతలు వేం నరేందర్‌రెడ్డి, నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్లు మానాల మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, జడ్పీ ఫ్లోర్‌లీడర్ మోహన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ఇందుప్రియ, లీడర్లు పండ్లరాజు, ఇంద్రాకరణ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చందు పాల్గొన్నారు.