Mohammed Shami: మతాన్ని బలవంతంగా రుద్దకూడదు.. షమీకి మద్దతుగా షమా మహమ్మద్

Mohammed Shami: మతాన్ని బలవంతంగా రుద్దకూడదు.. షమీకి మద్దతుగా షమా మహమ్మద్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసినందుకు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమ్మద్ తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పేసర్ కు మద్దతుగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రంజాన్ మాసంలో షమీ జ్యూస్ తాగుతూ కనిపించడంతో ఉపవాసం (రోజా) లేకుండా షమీ పాపం చేసాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరేల్వి అన్నారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ షమా మహమ్మద్ షమీకి సపోర్ట్ గా నిలిచింది. 

షమా మహమ్మద్  మాట్లాడుతూ.. "ఇస్లాంలో రంజాన్ సమయంలో చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం ప్రయాణిస్తున్నప్పుడు  ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మహమ్మద్ షమీ తన సొంత స్థలంలో లేడు. అతను ప్రయాణిస్తున్నాడు. దాహం వేసే క్రీడ ఆడుతున్నాడు. మీరు ఒక క్రీడ ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవరూ పట్టుపట్టకూడదు. మతాన్ని ఎవరిపైనా బలవంతం చేయకూడదు.  మీ కర్మలు చాలా ముఖ్యమైనవి. ఇస్లాం చాలా శాస్త్రీయ మతం".అని ఆమె అన్నారు.

Also Read:-వలలకు తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్..

అసలేం జరిగిందంటే:

ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరేల్వి మాట్లాడుతూ.. "ఇస్లాం ఉపవాసం (రోజా) తప్పనిసరి అని ప్రకటించింది. ఈ ఉపవాసం పరిణతి చెందిన పురుషులు, స్త్రీలందరికీ తప్పనిసరి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే, అది తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా, మహమ్మద్ షమీ రోజాను పాటించలేదు. ఉపవాసం పాటించడం అతని మతపరమైన విధి. అయినప్పటికీ షమీ అది చేయలేదు. ఉపవాసం (రోజా) లేకపోవడం వలన షమీ నేరం చేశాడు. అతను ఇలా చేసి ఉండకూడదు. షరియత్ దృష్టిలో అతను నేరస్థుడు. మతపరంగా అతను దోషిగా నిలుస్తాడు. ఇస్లాం యొక్క బాధ్యతలను ఖచ్చితంగా పాటించాలని నేను అతనికి సలహా ఇస్తున్నాను".అని ఆయన అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం (మార్చి 4) సెమీ ఫైనల్ మ్యాచ్ షమీ జ్యూస్ తాగుతున్న క్లిప్ ఒకటి వైరల్ అయింది. శనివారం( మార్చి 2) నుంచి నెలవంక కనిపించడంతో ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైంది.  షాబుద్దీన్ బరేల్వి షమీని విమర్శించినా నెటిజన్స్ మాత్రం ఈ టీమిండియా పేసర్ ను అభినందిస్తున్నారు. మతం కంటే దేశానికే ఎక్కువ గౌరవం ఇచ్చినందుకు అతనిపై ప్రశంసలు కురిపించారు. షమీ ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.