కాంగ్రెస్‌‌ నేతకు గుండెపోటు.. సీపీఆర్‌‌ చేసి కాపాడిన ఎమ్మెల్యే తెల్లం

కాంగ్రెస్‌‌ నేతకు గుండెపోటు..  సీపీఆర్‌‌ చేసి కాపాడిన ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం, వెలుగు:  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటనలో శుక్రవారం కాంగ్రెస్ ​నేతకు గుండెపోటు వచ్చింది. మంత్రి వెంట ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు సకాలంలో సీపీఆర్​ చేసి ఆ నేతను కాపాడారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్​ లీడర్​ సుధాకర్.. తుమ్మల నాగేశ్వరరావు పర్యటనకు వచ్చారు. 

భోజన సమయంలో ఆయన గుండె పోటుతో కుప్పకూలిపోయారు. దాంతో కాంగ్రెస్​ కార్యకర్తలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. కానీ, అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం సుధాకర్​ను పడుకోబెట్టి సీపీఆర్ చేశారు.  సుధాకర్ స్ఫృహలోకి వచ్చాక సారిబిట్రేట్​ టాబ్లెట్​ను మింగించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.