కాంగ్రెస్ నేతకు గుండెపోటు..సీపీఆర్ చేసి కాపాడిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

కాంగ్రెస్ నేతకు గుండెపోటు..సీపీఆర్ చేసి కాపాడిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

గుండెపోటు ఎప్పుడు ఎక్కడ ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. అప్పటి వరకు బాగానే ఉన్న సడెన్ గా ఉన్నచోటనే కుప్పకూలిపోతున్నారు . చిన్నా పెద్దా వయసుతో సంబంధం లేకుండా డా వస్తున్న గుండెపోట్లు ఈ మధ్య హడలెత్తిస్తున్నాయి.  సమయానికి పక్కన సీపీఆర్ చేసే వాళ్లు ఉంటే ఒక్కోసారి ప్రాణాపాయం తప్పుతోంది. లేదంటే ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు పోతున్న సంఘటనలు ఉన్నాయి.  

►ALSO READ | కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనయ్​..మజ్లిస్​ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ పోటీకి దూరం: కేంద్ర మంత్రి బండి సంజయ్

లేటెస్ట్ గా ఏప్రిల్ 4న  భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా  కాంగ్రెస్ నేత, మాజీ మండల అధ్యక్షులు తోటమళ్ళ సుధాకర్ కు గుండె పోటు వచ్చింది. అదే సమయానికి అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్  వెంటనే  సీపీఆర్ చేశాడు. తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించారు. రాజకీయాల్లోకి రాకముందు తెల్లం వెంకట్రావ్ డాక్టర్ గా పనిచేశారు.