పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ నేత బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పీఎస్ లో జరిగింది. వట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్ బర్త్ డే సందర్బంగా ఎస్సై లక్ష్మన్, కానిస్టేబుల్స్ అతనితో కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల బర్త్ డేలు పీఎస్ లో చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ శాఖ..ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి ఎస్సై లక్ష్మన్ ను మల్టిజోన్ -II. ఐ జిపి కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. నివేదిక అందిన వెంటనే క్రమశిక్షణ చర్యలు చేపడతామని మల్టీ జోన్ ఐజీ వి సత్యనారాయణ తెలియజేశారు.