- కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో ఆమె పోస్ట్ పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లోనే మొదట తెలంగాణ తల్లి విగ్రహాన్ని తల్లి తెలంగాణ పార్టీ బడుగులకు ప్రతిరూపంగా ఆవిష్కరించిందని, దాన్ని కాదని బీఆర్ఎస్ మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని బడుగుల విగ్రహంగా ఆవిష్కరించి, అధికారిక గుర్తింపు ఇచ్చారని, బీఆర్ఎస్ ఆ పనిని ఎందుకు చేయలేకపోయిందన్నారు.