కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్​ వెంకటస్వామి

కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్​ వెంకటస్వామి
  • కార్మికుల హక్కుల కోసం కాకా వెంకటస్వామి పోరాడిండు 
  • వంశీకృష్ణకు సీపీఐ-ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

కోల్​బెల్ట్/బెల్లంపల్లి/నస్పూర్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి బాటలోనే పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజా సేవ చేస్తాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం నస్పూర్​మున్సిపాలిటీలోని పీవీఆర్​ గార్డెన్స్​లో శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూ–సీ-సీపీఐ జనరల్​బాడీ మీటింగ్​ నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్​ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి జీవితాంతం కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని, 101 యూనియన్లకు అధ్యక్షుడిగా కొనసాగిన గొప్ప లీడర్​ అన్నారు.

 సింగరేణి సంస్థ నష్టాల బారిన పడినప్పుడు రూ.650 కోట్లను ఎన్టీపీసీ నుంచి రుణం ఇప్పించి సంస్థతో పాటు లక్ష ఉద్యోగులను కాపాడారన్నారు. కేంద్రమంత్రిగా కొనసాగిన కాలంలో కోలిండియా బొగ్గు గని కార్మికులు, ప్రైవేటు సెక్టార్​ కార్మికులకు పెన్షన్​ విధానం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆయన బాటలో నడుస్తున్న వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు.

 సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఇండియా కూటమి సపోర్టు చేస్తున్న ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపిస్తామని లీడర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ స్టేట్ ​ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్​ సెక్రటరీలు వీరభద్రయ్య, బాజీసైదా, ముస్కె సమ్మయ్య, సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, సీనియర్​జర్నలిస్ట్ ఎండీ మునీర్, కాంగ్రెస్ రాష్ట్ర లీడర్ బండి సదానందం యాదవ్​  తదితరులు పాల్గొన్నారు. 

కల్వరి చర్చిలో ఎమ్మెల్యేల ప్రార్థనలు

బెల్లంపల్లి మండలంలోని కల్వరి చర్చిలో క్రైస్తవులతో కలిసి చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్​ వెంకటస్వామి, గడ్డం వినోద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేలను  ఆశీర్వదించారు. వారి వెంట బెల్లంపల్లి మున్సిపల్ చైర్​పర్సన్​జక్కుల శ్వేత, మాజీ చైర్మన్​మత్తమూరి సూరిబాబు, మాజీ జడ్పీటీసీ రాంచందర్, లీడర్లు బండి సదానందం యాదవ్, హేమవతి, మునిమంద రమేశ్​, ప్రదీప్, నాతరి స్వామి తదితరులున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు బెల్లంపల్లి పట్టణం మార్కెట్​ఏరియాలో జనగణమణ గేయాలపన కార్యక్రమంలో 
పాల్గొన్నారు. 

కాంగ్రెస్​లో పలువురి చేరిక

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లీడర్ శ్రీనివాస్​ యాదవ్​ నేతృత్వంలో బీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్​ లీడర్లు ఎమ్మెల్యే వివేక్​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కాన్కూర్​మాజీ ఉప సర్పంచి భారతి వెంకటస్వామి, వార్డు మెంబర్​రేగుంట పద్మ, ఎమ్మార్పీఎస్​ లీడర్లు రేగుంట సంపత్, బాపురావు, శంకర్​తో పాటు పలువురు చేరారు. రసూల్​పల్లిలోని పోచమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు.

వంశీకి ఎమ్మార్పీఎస్, సీఐటీయూ మద్దతు

ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని ఎమ్మార్పీఎస్​ మంచిర్యాల టౌన్ ప్రెసిడెంట్​కొండ్ర రాజు, జిల్లా ప్రెసిడెంట్​ కోంకట రవీందర్, రాష్ట్ర లీడర్​ తుంగపిండి రాజేశ్​కుమార్ ​పిలుపునిచ్చారు. వంశీకృష్ణకు మంచి విజన్​ ఉందని, ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి  వచ్చారన్నారు. వంశీకృష్ణకు మాదిగల మద్దతు ఉంటుందని, ఆయనను భారీ మోజార్టీతో గెలిపించేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్​కు అమ్ముతున్న బీజేపీని ఎన్నికల్లో ఓడించాలని, వంశీకృష్ణను సింగరేణి కార్మికవర్గం గెలిపించాలని సీఐటీయూ ప్రెసిడెంట్​ ఎస్.వెంకటస్వామి, సెక్రటరీ అల్లి రాజేందర్, రామగిరి రామస్వామి పిలుపునిచ్చారు.