సుమన్​కు కమీషన్లపై ఉన్న సోయి ప్రజల మీద లేదు : వివేక్​ వెంకటస్వామి

  • సింగరేణి ప్రాంతాల్లో కాకా ట్రస్ట్​ ద్వారా నీళ్లు అందించాం

కోల్​బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే బాల్క సుమన్​కు కమీషన్ల మీద ఉన్న సోయి ప్రజల బాగోగులపై లేదని చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి వివేక్​వెంకటస్వామి అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆదివారం, సోమవారం ఆయన మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్, ఇసుక దందా, నేషనల్ హై వే ద్వారా బాల్క సుమన్ కోట్లు సంపాదించడని నల్లాల ఓదెలు, వాసిరెడి సీతారామయ్య ఈ సందర్భంగా ఆరోపించారు.

సుమన్ ఓట్లు కొంటాననే ధీమాతో ఉన్నాడని అమ్ముడు పోవద్దని ప్రజలకు సూచించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ​పరిధి క్యాతనపల్లి, 8వార్డు గద్దెరాగడి వినాయక నగర్, పులిమడుగు గ్రామం, మందమర్రి మున్సిపాలిటీలోని 19 వార్డు విద్యానగర్, రాజన్నల వాడ, 24 వార్డు ఊరు మందమర్రి, రామకృష్ణాపూర్, భగత్​సింగ్​ నగర్​లో ఎన్నికల ప్రచార, చేరిక కార్యక్రమాలను నిర్వహించారు. మందమర్రి సీఎస్​ఐ చర్చిలో పూజలు చేశారు.

ఈ సందర్భంగా క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద అంసపూర్తిగా ఉన్న  రైల్వే ఆర్వోబీని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​లీడర్లు దుర్గం నరేశ్, రాఘునాథ్​రెడ్డి, ఎండీ అబ్దుల్​అజీజ్, మహంకాళి శ్రీనివాస్, సొత్కు సుదర్శన్​, బండి సదానందం, పైడిమల్ల నర్సింగ్, పల్లె రాజు, నోముల ఉపేందర్​గౌడ్, బత్తుల రమేశ్, గోపతి రాజయ్య, ఓడ్నాల శ్రీనివాస్, శివకిరణ్, సత్యపాల్, ఎర్రవెల్లి రాజేశ్, వేణు, గడ్డం శ్రీనివాస్, సీపీఐ లీడర్లు రామడుగు లక్ష్మణ్, ఎండీ అక్బర్​అలీ, మిట్టపెల్లి శ్రీనివాస్​, వనం సత్యం, పౌల్, కిష్టయ్య  తదితరులు పాల్గొన్నారు. 

బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు ప్రజలకు అండగా ఉంటాం
వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ 

కోల్ బెల్ట్ /జైపూర్, వెలుగు: ఎమ్మెల్యే బాల్క సుమన్ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ ప్రజలకు ధైర్యం చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పౌనూర్ లో ఆమె పర్యటించగా..  గ్రామ ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. సీనియర్ లీడర్ చల్లా సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు  ఎన్నుకున్న బాల్క సుమన్ వారికి సేవ చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. బాల్క సుమన్ ఏ గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోలేదన్నారు.

ALSO READ : టీడీపీ, జనసేన ఎన్నికల మిని మేనిఫెస్టో రిలీజ్.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం. . 

కాకా వెంకటస్వామి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాడని గుర్తుచేస్తూ.. అదే బాటలో వివేక్ వెంకట స్వామి నడుస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన 100 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇన్​చార్జి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ ప్యాయజ్, లీడర్లు ఎలుకంటి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, బక్కారెడ్డి, సీతారెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.