వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్నాయకులను కాంగ్రెస్‌పార్టీలో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేశ్‌గౌడ్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపాడు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఎమ్మెల్యే ఇంటి వద్ద గోపాల్పేట మండలం తాడిపర్తికి చెందిన బీఆర్ఎస్ లీడర్, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అనుచరులతో కలిసి అక్కడికి వచ్చిన గణేశ్గౌడ్తనకు బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారనే విషయం గురించి చెప్పలేదని, గత ప్రభుత్వ హయాంలో తన ప్రత్యర్థి తనపైనా, తన అనుచరులపైన మంత్రి సహకారంతో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించాడు.
ఎన్నికల ప్రచారంలోనూ తిరగనివ్వలేదని, అలాంటి వారిని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో నాయకుడికి గణేశ్గౌడ్కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గణేశ్మరో ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని కాల్చమంటూ అగ్గిపెట్టను ఎమ్మెల్యే పైన వేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి నాయకులు, కార్యకర్తలు పెట్రోల్పోసుకున్న వారిని పక్కను లాగేశారు. పోలీసులు అందరినీ పక్కకు జరిపారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లోకారెడ్డితో పాటు మరికొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిసి ఆవేశంతో ఒంటిపై పెట్రోలు పోసుకున్నానని గణేశ్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. గణేశ్గౌడ్చిన్నారెడ్డి అనుచరుడు.