ఎల్లారెడ్డిపేట,వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని కాంగ్రెస్ లీడర్లు నిర్వాహకులకు సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఉదయం కుండపోతగా కురిసిన వర్షానికి పదిర, వెంకటాపూర్ గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లలో వడ్లు తడిసి ముద్దయ్యాయి.
వీటిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఇతర లీడర్లు పరిశీలించారు. వారితో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, షేక్ గౌస్, బాల్ రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, మండే శ్రీను, బుచ్చగౌడ్ ఉన్నారు.