రేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం

ములుగు, వెలుగు : కాంగ్రెస్​ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో  సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు కొనడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతోందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ అన్నారు. తరుగు, దళారుల సమస్య లేకుండా చేశామని చెప్పారు.