
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆయన దారి ఎటు అనే చర్చ మొదలైంది. మైనంపల్లి కాంగ్రెస్ లోకి వెళ్తారనే చర్చలు కొనసాగుతున్న వేళ... ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసానికి కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ వెళ్లారు. ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్
మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఆయన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మెదక్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకే మైనంపల్లి పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్కాజ్ గిరి, మెదక్ రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. ఒకటి, రెండు రోజుల్లో తండ్రి కొడుకులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. రోహిత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ స్థానంలో బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఇది జరిగితే మెదక్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగనుంది.
మెదక్ లో అనూహ్యంగా మైనంపల్లి హన్మంతరావ్ రీఎంట్రీ ఇవ్వడంతో సీను మారిపోయింది. హన్మంతరావ్ 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీకి రిజైన్ చేసి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడుగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అక్కడికే పరిమితం అయ్యారు.
కొడుక్కు టికెట్ఇవ్వకపోవడంతో నారాజ్
తన కొడుకు రోహిత్ కు మెదక్ స్థానంలో బీఆర్ఎస్ టికెట్వస్తుందని హన్మంతరావ్ఆశించగా పార్టీ అధినేత కేసీఆర్ప్రకటించిన బీఆర్ఎస్క్యాండిడేట్స్లిస్ట్లో తన కొడుకు పేరు లేకపోవడంతో నారాజ్ అయ్యారు. ఆయనకు మల్కాజిగిరి టికెట్ఇచ్చినప్పటికి కొడుకుకు మెదక్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గ నాయకులు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పిన హన్మంతరావ్, బీఆర్ఎస్ పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందేమోనని వేచి చూశారు.
అయితే పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం (సెప్టెంబర్ 22న) బీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు మల్కాజిగిరి, కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్పార్టీ పెద్దల నుంచి హామీ లభించినట్టు తెలిసింది.