
వికారాబాద్, వెలుగు: ఎస్పీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. వికారాబాద్ కు వచ్చి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సన్మానించారు. అంతకుముందు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిండెంట్ సుధాకర్‌రెడ్డి, నాయకులు రెడ్యా నాయక్, సంగని జంగయ్య, మల్లేషం, ఆనంద్, ప్రదీప్తదితరులు పాల్గొన్నారు.