రుణ మాఫీ.. ఫుల్​ ఖుషీ.. సంబురాలకు రైతులు  సిద్ధం

  • కాంగ్రెస్​ రుణమాఫీ హామీ ఇచ్చింది వరంగల్​ నుంచే

అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేస్తామని’ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2022 మే 6 న వరంగల్​లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ నుంచే రాహుల్​ గాంధీ ‘వరంగల్​ రైతు డిక్లరేషన్​’ లో భాగంగా  రుణమాఫీ హామీ ప్రకటించారు.  ప్రభుత్వం ఏర్పాటు కావడంతో...  తొలి విడతగా రూ.లక్ష మేర రుణాలున్న రైతుల ఖాతాల్లో గురువారం నగదు జమ కానుంది. 

వరంగల్​ / జనగామ/ మహబూబాబాద్​/ ములుగు, వెలుగు : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ నేతలు, రైతులు రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలకు సిద్ధ మయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మండలాల వారీగా అధికారులు రైతుల పేర్లతో సహా జాబితాను విడుదల చేశారు. కాగా.. గురువారం సాయంత్రం రైతు వేదికల వద్ద రుణమాఫీ సంబురాలకు కాంగ్రెస్​ నాయకులు సిద్ధమవుతున్నారు. 

వరంగల్​ .. 

జిల్లాలో మొదటి విడత   22,061 మంది రైతులు రుణమాఫీ పొందనున్నారు. 13 మండలాల్లో రైతు లోన్​ అకౌంట్లలో గురువారం సాయంత్రంలోపు డబ్బులు జమ అవుతాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఖిలా వరంగల్ మండలంలోని బొల్లికుంట రైతు వేదికలో మంత్రి కొండా సురేఖ పాల్గొంటారని, నర్సంపేట రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట రైతు వేదికలో ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు పాల్గొననున్నారు. 

జనగామలో 26 వేల మందికి ...

 జిల్లాలోని లక్ష లోపు రుణాలున్న  26,373 రైతులకు రుణ మాఫీ కానుంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా.. లక్షన్నర మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.  వీరిలో అర్హులందరికీ మాఫీ చేయనున్నారు. 

మహబూబాబాద్​లో ... 

18 మండలాల్లో 1.45 లక్షల మంది రైతులకు రుణ మాఫీ కానుంది. మొత్తం రూ.1600 కోట్ల వరకు మాఫీ కానున్నట్లు ఆఫీసర్లు చెప్పారు. 2018 డిసెంబర్​ 12 నుంచి 2023 డిసెంబర్​ 9లోపు పంట రుణాల పొందిన రైతులకు మాఫీ వర్తించనుంది. 

జయశంకర్ భూపాలపల్లి.. 

 జిల్లాలో 16,502 మంది రైతులకు రైతు రుణమాఫీ కానునట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయభాస్కర్ సుమారు రూ. 150 కోట్లు మాఫీ జరగనున్నట్లు చెప్పారు. 

ములుగు.. 

జిల్లాలో 9 మండలాల్లో 12906 మంది రైతులకు రుణమాఫీ కానుంది. ఎస్​బీఐ ఫైనాన్సింగ్ బ్యాంకు పరిధిలోని ఇంచర్ల పాలంపేట లక్ష్మీదేవి పేట భూపాలపల్లి జిల్లాలోని గణపురం పీఏసీఎస్​ ల పరిధిలోని రైతులకు రుణమాఫీ వర్తించడం లేదు. దీంతో సుమారు 2800 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
సంబురాలకు ఏర్పాట్లు రైతు వేదికల్లో సంబురాలకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి నేరుగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికలను మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించారు. సీఎం రేవంత్​ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రజా ప్రతినిధులు,బ్యాంకు ఆఫీసర్లు,అగ్రికల్చర్​ ఆఫీసర్లు, కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీలనేతలు, రైతు సంఘాల నాయకులు, బారీ సంఖ్యలో వేడుకలకు హజరు కానున్నారు.