
సింగరేణి కార్మికుల పేరు మార్పిడి సమస్య గురించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెబితే ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల ఇస్తున్న మాదిరిగానే సింగరేణి కార్మికులకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పెన్షన్ ఇచ్చేలా చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో వారసత్వ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే.. పైరవీలు చేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాల్జేస్తోందని ఆరోపించారు. నవంబర్ 30న గండ్ర సత్యనారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read :- అన్నదాతపై హమాలీల దాడి..
కార్మికులను ఆదుకుంటాం : మధుయాష్కీ
నల్ల బంగారం సంపదను పెంచుతున్న కార్మికులను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మారినపుడు పాలసీలు కూడా మారుతాయని, పాలసీలు మారితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పర్యటిస్తున్నారు. భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ సింగరేణి కార్మికులతో హాజరయ్యారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.