కాకా ఫౌండేషన్ ద్వారా బోర్ వెల్, బెంచీలు ఇప్పించండి : కాంగ్రెస్ నాయకులు

పెద్దపల్లి,వెలుగు:  కాకా ఫౌండేషన్ ద్వారా సమ్మక్క జాతరకు బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైస్కూల్ కు బెంచీలు ఇప్పించాలని ధర్మారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. శుక్రవారం పెద్దపల్లిలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ధర్మారం మండలం నంది మేడారంలో వచ్చే నెలలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్​వేయించాలని, అలాగే అక్కడి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 బెంచీలు సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో కాడే సూర్యనారాయణ, రాజలింగయ్య గౌడ్, పున్నవేని స్వామి, ఎండీ ఆశుబ్, తదితరులు ఉన్నారు.

మృతుని కుటుంబానికి పరామర్శ 

కరీంనగర్​వీ6 స్టాఫ్​రిపోర్టర్​వెంకటేశ్​తండ్రి పూదరి రాజేశం ఇటీవల చనిపోయారు. వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుటుంబసభ్యులను పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరామర్శించారు. ఆయన వెంట సూర్యనారాయణ, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  శ్రీశైలం, శ్రీనివాస్,  భూమయ్య, శ్రీనివాస్, రాజు, స్వామి ఉన్నారు.