- ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం
- నిలిచిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం
కమలాపూర్, వెలుగు : ప్రొటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ లీడర్లు అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కన్నూరు గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. భవనం ప్రారంభించడానికి కౌశిక్ రెడ్డి వచ్చారు. ప్రొటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి లేకుండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం సరికాదన్నారు. అయితే అభివృద్ధికి సహకరించాలని, కాంగ్రెస్ లీడర్లు ఇలా చేయడం కరెక్ట్ కాదని కౌశిక్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన వెనుదిరిగారు.