బీజేపీ మాజీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం

బీజేపీ మాజీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం

బాల్కొండ, వెలుగు : వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేశ్​బిదురి వ్యాఖ్యలను నిరసిస్తూ బాల్కొండలో కాంగ్రెస్​ నాయకులు బుధవారం దిష్టిబొమ్మ దహనం చేశారు. బాల్కొండ పాత హైవేపై కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆందోళన చేశారు.

మహిళా ఎంపీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే రమేశ్​ బిదురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకటేశ్​ గౌడ్, లీడర్లు పాల్గొన్నారు.