ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మల దగ్ధం

కరీంనగర్ జిల్లాలో మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు కాంగ్రెస్ నాయకులు. మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇల్లంతకుంట మండలం సోమవారం పేట సర్పంచ్ మృతిపై శనివారం (ఆగస్టు 5వ తేదీన) రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే రసమయి అబద్దాలు మాట్లాడారంటూ నిరసనలు తెలిపారు. 

పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకుని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమారంపేట గ్రామ సర్పంచ్ అనారోగ్యంతో మృతి చెందాడు. చికిత్స సమయంలో ఆయనకు ఎల్ఓసీ ఇచ్చినట్లు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్దం చెప్పడం బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సర్పంచ్  కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రసమయి నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.