
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సోమవారం అసెంబ్లీ ఆమోదం తెలపడంతో గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్ లోని పలువురు బీసీ నేతలు పటాకులు పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆమోదంతో రేవంత్ సర్కార్ బీసీల పక్షపాతి అని మరోసారి చాటుకుందని తెలిపారు. ఈ సంబురాల్లో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు.