
కోరుట్ల, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోరుట్లో కాంగ్రెస్ నియోజకర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ , మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రాలు తీసుకోని సాహసోపేత నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, పట్టణ, మండల, బ్లాక్ అధ్యక్షులు గంగాధర్, రాజం, సత్యనారాయణ, కవిత, అనిల్ పాల్గొన్నారు.