![మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్‌డే వేడుకలు](https://static.v6velugu.com/uploads/2025/02/congress-leaders-celebrate-mp-vamsi-krishna-birthday-with-grandeur-in-mancherial-district_CQ9rTW5auO.jpg)
నెట్వర్క్, వెలుగు: కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. సోమవారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, కాకా అభిమానులు, సోషల్‌మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ బర్త్‌డే వేడుకలను వేర్వేరుగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్‌సిటీ కాలనీలోని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్‌డొనేషన్ క్యాంపు నిర్వహించగా దాదాపు వంద మంది రక్తదానం చేశారు.
మందమర్రిలో కాంగ్రెస్ లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్బండి సదానందం యాదవ్ నేతృత్వంలో మారుతీనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు, నస్పూర్(కృష్ణాకాలనీ) మున్సిపాలిటీల్లో, భీమారం, నెన్నెల, జైపూర్, కోటపల్లి మండల కేంద్రాల్లో కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు, కాకా అభిమానులు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్, మండల ప్రెసిడెంట్లు ఉపేందర్‌గౌడ్, పల్లె రాజు, చెన్న సూర్యనారాయణ, మోహన్‌రెడ్డి, బాపగౌడ్ తదితరులు పాల్గొన్నారు.