కోల్‌బెల్ట్,వెలుగు : తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. మంగళవారం మందమర్రిలోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు కాంగ్రెస్ లీడర్లు, అభిమానుల మధ్య స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు.
మార్కెట్లో ఎన్ఎస్యూఐ మాజీ స్టేట్ సెక్రటరీ మహంత్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో లీడర్లు కాసర్ల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, నల్లాల శ్రవన్, పైడిమల్ల నర్సింగ్, పాషా, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.