
సిద్దిపేట టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ సిద్ధిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు తెలిపారు. నాయకులు గంప మహేందర్ రావు, బొమ్మల యాదగిరి, సాకి ఆనంద్, ఆలకుంట మహేందర్, పయ్యావుల ఎల్లం, ముద్దం లక్ష్మి, మార్క సతీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.