సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు

వనపర్తి, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్  క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి విమర్శించారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్‌‌‌‌‌‌‌‌పేట మండలం కేశంపేట, ఏదుట్ల, చాకలిపల్లి, గోపాల్ పేటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి..  వందల ఎకరాల భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీరంగాపురం జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.

 హామీల అమలేది : సంపత్ కుమార్

అయిజ, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ విమర్శించారు. స్వాతంత్ర్య గౌరవ పాదయాత్రలో భాగంగా ఆదివారం అయిజ మండలం చిన్నతాండ్రపాడు, రాజోలి మండలం చిన్నధ్వాడ, పెద్దధన్వాడ, నర్సన్నూర్, మాన్‌‌‌‌‌‌‌‌ దొడ్డి, తుమ్మిళ్ళ, పెద్ద తాండపాడు వరకు నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలంపూర్ అభివృద్ధికి సంబంధించి 14అంశాలపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివేదిక ఇస్తే ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ స్టేట్ ఓబీసీ సెక్రటరీ శెక్షావలి ఆచారి, లీడర్లు నాగ శిరోమణి, తిప్పన్న, మద్దిలేటి, దేవేందర్ పాల్గొన్నారు.