కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నవ్‌‌‌‌‌‌‌‌?

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నవ్‌‌‌‌‌‌‌‌?
  • కోరుట్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకుల ఫైర్

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు నిర్వహిస్తున్న వార్డు సభలో.. మాజీ సీఎం కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని 21వ వార్డులో శుక్రవారం జరిగిన వార్డు సభకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల ప్రజలు ఎవరికీ దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయని చెప్పడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజలు అభ్యంతరం తెలిపారు.

పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ లీడర్లు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు అక్కడికి చేరుకోగా.. ప్రభుత్వ కార్యక్రమానికి నువ్వెలా వస్తావని ఎమ్మెల్యే ఆయనను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.  

కోరుట్ల,వెలుగు: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.