హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. బడ్జెట్ సెషన్ లో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం లేదని తెలిపారు. అనవసర విషయాలను ప్రస్తావించి, ప్రభుత్వాన్ని విమర్శించారన్నారు.
సోమవారం గాంధీ భవన్ లో మృత్యుంజయం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని కేటీఆర్, హరీశ్ రావు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. గత 10 ఏండ్లు సీఎం, మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు రోజు రాత్రే ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.